ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే చలానా డిస్కౌంట్లు ప్రకటించామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న దృశ్యా పెండింగ్ చలానా డిస్కౌంట్ ప్రకటించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలానాలతో 1,750 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, డిస్కౌంట్ ప్రకటించడం వల్ల కేవలం 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందన్నారు. ట్రాఫిక్ చలాన్ల వల్లే ప్రభుత్వంకు రెవెన్యూ వస్తుందనే అపోహ ఉండకూడదని, రెవెన్యూ నింపడానికి…