డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కుపాదం మోపాల్సిందే. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీఛమణచాల్సిందే. ఇప్పుడిదే చేస్తోంది ఈగల్ టీమ్. కానీ పబ్స్ మాటున జరిగే గలీజ్ దందాకు చెక్ పెట్టనంత కాలం.. ఇది సాధ్యం కాదనేది నిపుణుల మాట. ఎందుకంటే డ్రగ్స్ చేసే అరాచకం అంతా ఇంతా కాదు. డ్రగ్స్ మత్తు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉన్మాదిలా మారుస్తుంది. ఫలితంగా సమాజంలో అలజడి రేగుతుంది.