హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట్, మీర్‌పేట్, గుర్రంగూడ, వనస్థలిపురంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్…
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , విద్యుత్…
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ఉప్పల్, ఎల్‌బి నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా పలు ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి పరిస్థితిని మరింత దిగజార్చింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం, కార్యాలయానికి వెళ్లేవారు ఇళ్లకు…
వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు…
ఆలస్యంగా, హైదరాబాద్ అసాధారణ వర్షపాతం నమూనాను ఎదుర్కొంటోంది, అయితే సాధారణ రుతుపవన వాతావరణం లేకపోవడంతో సగటు కంటే ఎక్కువ జల్లులు కురుస్తున్నాయి. వానదేవతలు నగరాన్ని కొరడా ఝుళిపించడానికి ఎంచుకున్న కాలం కూడా మారిపోయింది. పగటిపూట చెదురుమదురుగా , తేమతో కూడిన వర్షాలు కురుస్తుండగా, భారీ వర్షాలు చాలా ఆలస్యంగా లేదా తెల్లవారుజామున కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే తరహాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్కైమెట్ వెదర్ సర్వీసెస్‌లోని వాతావరణ నిపుణుడు మహేశ్ పలావత్ ఈ అసాధారణ…
Hyderabad Rains News: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలిలోతు వరకు నీరు చేరింది. రోడ్లపైకి భారీ నీరు వస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.…