Hyderabad Rains Trigger Massive Traffic Jam: తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర…