హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస దాడుల్లో పలు ఆన్‌లైన్ మోసగాళ్లను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
ప్రజల్లో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరై, తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తన అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడని భావోద్వేగంగా చెప్పారు. “అప్పటి వరకు నాకు ఎలాంటి సీరియస్‌నెస్ లేదు. ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించేవాడిని కాదు. కానీ…
ప్రజల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా… హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ ట్రాఫిక్ మీట్‌కు రావటం వెనుక నా వ్యక్తిగత కారణం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 10,…
Deer Meat In HYD: అతను పేరుకు డాక్టర్ వృత్తి నిర్వహిస్తున్నాడు. కానీ ప్రవృత్తి మాత్రం హంటర్. అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో నిత్యం వన్యప్రాణులను వేటాడుతున్నాడు. వాటి మాంసం, కొమ్ముల వంటి ఇతర శరీర భాగాలను అమ్ముకుంటూ అడ్డంగా సంపాదిస్తున్నాడు. ఇందుకోసం తుపాకులు సైతం వినియోగిస్తున్నాడు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో అతన్ని పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ డాక్టర్ ఎవరు? Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక…
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి.
అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న ఒక భారీ మోసాల గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్తంగా చంద్రాయణగుట్టలో జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.
Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా…
Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో…
Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది.…
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి…