HYDRA : హైదరాబాద్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్న హైడ్రా అధికారులు శనివారం స్థానికులతో కీలక సమావేశం నిర్వహించారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల ప్రార్థనా స్థలం ‘చిల్లా’ మార్పు గురించి ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటూ హైడ్రా కమిషనర్ స్వయంగా నివాసితులతో మాట్లాడారు. చెరువు పునరుజ్జీవనంలో భాగంగా ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలను గట్టు వైపు మార్చాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించగా, రెండు వర్గాల స్థానికులూ ఈ నిర్ణయానికి అంగీకారం…