Musi River: హైదరాబాద్‌లో వరుస వర్షాల తర్వాత ఉద్ధృతంగా ప్రవహించిన మూసీ నది వరద పూర్తిగా తగ్గింది. జంట జలాశయాలకు (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్) ఇన్ఫ్లో తగ్గడంతో జలమండలి అధికారులు మూసీకి నీటి విడుదలను తగ్గించారు. ఉస్మాన్ సాగర్‌కు ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, కేవలం 121 క్యూసెక్కుల నీరు మాత్రమే మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్‌కు 1,800 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో, 339 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో నిన్న…
Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్ తెరిచి వరద…
CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రోడ్లు మునిగిపోయాయి.