కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు. వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో…