Global Pandemic: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందన్ని ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని విధంగా 2019 నుంచి రెండేళ్ల పాటు ప్రపంచదేశాలు ‘‘లాక్‌డౌన్’’లోకి వెళ్లాయి. లక్షల మంది చనిపోయారు. కోట్లలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఇప్పటికీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.