ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు…