సాధారణంగా ఎవరైన బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాలు పెద్దగా బయటకు రావు. అయితే, కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. ఆయన మరణించాడని తెలుసుకున్న హవినహడగలి ప్రజలు సోకసముద్రంలో మునిగిపోయారు. హుచ్చబస్య అంతిమయాత్రను ఘనంగా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్రను నిర్వహించి ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. Read: హెచ్చరిక:…