BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు.
Hubballi riot: 2022 కర్ణాటక హుబ్బల్లి అల్లర్లు, మతకలహాల కేసులో కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి చేసిన గుంపు నాయకత్వం వహించారే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇతెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నాయకులపై కేసులు ఉపసంహరించుకుంది.