Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి సంధి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.