ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వార్తలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మంత్రి సురేష్ ప్రకటన నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. Read Also: ఏపీలోనూ…