ఇవాళ హోలీ పండుగ. ఈ రంగుల పండుగ లాగే జీవితం కూడా రంగుల మయంగా వుండాలని, అంతా కలిసి జరుపుకుంటారు. అయితే అక్కడక్కడా కొందరు ఆకతాయిలు, మందుబాబులు హల్ చల్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హోలీ పండుగ సందర్భంగా ఇంట్లో మద్యం సేవించి రోడ్డుపైకి నానా గొడవ చేశారు. తమ చేతిలోని మద్యం సీసాలను జనంపైన విసిరేశారు, రోడ్డు వెంట వెళ్ళే వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి…