HIV cases: ఉత్తరాఖండ్‌లో హెచ్ఐవీ కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. రాంనగర్‌లో హెచ్ఐవీ కేసులు సంఖ్య హఠాత్తుగా పెరిగింది. దీనిపై అక్కడి ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 19 నుంచి 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది స్థానికంగా ఆరోగ్య శాఖలో హెచ్చరికల్ని పెంచింది.
త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో 47 మంది విద్యార్థులు మరణించారని.. మరో 828 మంది విద్యార్థుల్లో పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్‌ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు.
Haldwani jail: హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి…