ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని... ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.