Kaun Banega Crorepati 17: అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 17 మొదటి కోటీశ్వరుడిని చేసింది. తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో ఉత్తరాఖండ్‌కి చెందిన ఆదిత్య కుమార్, అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే, ఆ తర్వాత ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.