ఆ నియోజకవర్గంలో అధికారపార్టీకి ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. ఇద్దరు కలిసి సాగితే ఏ గొడవా ఉండేది కాదు. ఆధిపత్యం కోసం కుస్తీపట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీ ఒకటే కానీ.. రెండు కార్యాలయాలు.. రెండు గ్రూపులు. మూడేళ్లుగా ఇదే తంతు. సమస్య ఏదైనా వాళ్ల మధ్య అగ్గి రాజేస్తుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? ఆధిపత్యం కోసం ఇద్దరు నేతల ఫైట్..! అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణను ఎదుర్కొనేందుకు వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది.…