Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో…