కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Assam Police arrests over 34 people with Al-Qaeda links: అస్సాం రాష్ట్రంలో టెర్రర్ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అస్సాంలోని పలు జిల్లాల్లో ఇమామ్ లుగా పనిచేస్తున్న వారితో పాటు మదరసా కేంద్రంగా ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న వారిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ ఖైదా అనుబంధంగా ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థ తరుపున పని చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా అస్సాంలో గురువారం మరికొన్ని అరెస్టులు జరిగాయి.…
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి…
సహజంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజల కన్నులు చాలా చిన్నగా ఉంటాయి. వీటిపై దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తన చిన్న కళ్ల గురించి నాగాలాండ్ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టెమ్ జెన్ ఇన్మా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన హాస్యానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతలా హస్యం పంచిన వీడియోలో ఏముందంటే.. నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన…
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే అని అన్నారు. 2024లో ఇప్పడు ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉందని అన్నారు. తాజాగా అస్సాం బటద్రవాలో పోలీస్ స్టేషన్…
సర్జికల్ స్ట్రయిక్స్కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…