భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్ కెరియర్ లో 40 మ్యాచ్ లకు పైగా ఆడిన ఆటగాళ్లకు ఇక నుండి ఒక్కో మ్యాచ్ కు 60,000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అండర్ 23 ఆటగాళ్లకు 25,000 వేలు, అండర్ 19 ఆటగాళ్లకు 20,000 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.…