వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు. తరచూ తుపానులు, మహమ్మారి…