రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ‘హాలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. మహిళలను అవమానపర్చిన, కించపర్చిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తేవాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో ఇటువంటి వాటిని నిషేధించాలని సూచించారు. ఆడింగోడివా, చేతికి గాజులు వేసుకున్నావా, చీర కట్టుకో వంటి మాటలను ఇళ్ల దగ్గర మాట్లాడటం మానేయండని విజ్ఞప్తి చేశారు. లోకేష్ అన్నయ్య చెప్పాడని చెప్పండని…