Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు…
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శనివారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరవాసులు వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. అయితే.. వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రదేశం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో…
Weather Report: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ నేడు (ఆదివారం) ఒక ప్రకటనలో భాగంగా.. సోమవారం (ఏప్రిల్ 14) రోజున రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (11) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.…
గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.