వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆయుర్వేద మందకు ప్రజలు పోటెత్తారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో తోపులాట జరిగింది. తోపులాట జరగడంతో ఆయుర్వేద మందును నిలిపేశారు. మందు కోసం కనీసం 50వేల మంది వరకు వస్తారని అంచనా వేశారు. అయితే, పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కరోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్కడికి వస్తుండటంతో మాములు ప్రజలు ఆందోళన చేశారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మందు పంపిణీవద్ద సోషల్ డిస్టెన్స్ కనిపించలేదు. ఇక…