Flash Floods: ఈశాన్య భారతదేశంలో వర్షాలు తీవ్రవినాశం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో ఏర్పడిన వరదల వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఒక్కరోజే 14 మంది మృతి చెందారు. ఇక అస్సాంలో 12 జిల్లాల్లో వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. సుమారు 60,000 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితులయ్యారు. కామ్ రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో గత 24 గంటల్లో వరుసగా జరిగిన కొండచరియల…