Today (23-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ఘోరాతిఘోరంగా అంతమైంది. వరుసగా నాలుగో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం సైతం భారీ నష్టాలను మూటగట్టుకుంది. అసలే గ్లోబల్ ఇన్వెస్టర్ల మూడ్ ఏమాత్రం బాగలేకపోవటం, దీనికి కొవిడ్-19 భయాలు తోడవటంతో షేర్ల కొనుగోళ్లు నిల్.. స్టాక్స్ విక్రయాలు ఫుల్.. అన్నట్లుగా ఈ రోజంతా కొనసాగింది. రెండు సూచీలు కూడా అనూహ్యంగా బెంచ్ మార్క్‌లను బ్రేక్ చేసి డౌన్ అయ్యాయి.