Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. బులంద్‌షహర్‌లో గురువారం 48 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పలు చోట్ల కరెంటు కోతలతో గందరగోళం నెలకొంది.
Weather : వాయువ్య భారతం విపరీతమైన వేడిని ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాబోయే 5 రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే, అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
Heat wave in America: ప్రస్తుతం అమెరికాలోని ప్రజలు విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి నగరాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ దాటింది.
Bihar : బీహార్‌లోని బక్సర్‌లో వేడిగాలుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా మూడో వ్యక్తి కూడా ఆసుపత్రిలో చేరాడు. భోజ్‌పూర్ జిల్లా దిఘా గ్రామానికి చెందిన రాజ్‌నాథ్ సింగ్ హీట్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు చెబుతున్నారు.
Heat Wave Alert: ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇదే సమయంలో.. వడగాల్పులు విరుచుకుపడుతున్నాయి.. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు…
తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.