Supreme Court: చికిత్స తర్వాత రోగి కోలుకోకపోయినా లేదా మరణిస్తే వైద్యుడు బాధ్యత వహించలేడని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రసవం అనంతరం ఓ మహిళ మరణానికి వైద్యుడే(గైనకాలజిస్ట్) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా, జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కాకపోతే లేదా ఆశించిన ఫలితం సాధించకపోతే ఆ వైద్యుడిని నిందించడం సరికాదని పేర్కొంది. ఏ వివేకవంతమైన ప్రొఫెషనల్ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా…