2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కెనడా. అందులో భాగంగానే ఈ నియంత్రణ అమలు చేయనున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని ఆరోగ్య అధికారులు తెలిపారు.