భారతదేశంలో ఇటీవలి సంవత్సరాలలో యువత గుండెపోటుకు ఎక్కువగా గురవుతన్నారు. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు బాగా పెరిగాయి. వైద్యులు ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం, తీవ్ర ఒత్తిడి లాంటివి గుండెపోటుకు దారితీస్తాయి. గుండెను కాపాడుకోవడానికి ఆహారాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో చూద్దాం. ఉప్పు: ఉప్పు తీసుకోవడంను తగ్గించాలని…