Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన…