ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ వైద్య శాఖ సీరియస్ అయింది. ఎన్టీవీలో వరుస కథనాలతో ఆస్పత్రులపై యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 64 ఆస్పత్రులపై 88 నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు, వైద్యశాఖ అనుసంధానంగా ఉండి.. ఎక్కువ బిల్స్ వేస్తే తగ్గిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 4 కోట్లు…