సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లో ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ బుధవారం ముందస్తు బెయిల్‌ను కోరింది. ఈ క్రమంలో ఆ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.