Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది.