వంశీ దర్శకత్వం వహించిన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ మూవీలో కొండవలస నోటి నుండి పదే పదే వచ్చే డైలాగ్ ‘ఐతే ఓకే’! దీన్ని రాసింది నటుడు కృష్ణ భగవాన్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. నటుడిలో రచయిత ఉంటే… ఆ సంభాషణలు ఎంతగానో పండుతాయనడానికి ఉదాహరణ ఇదే! ఆ మూవీ సక్సెస్ లో కృష్ణ భగవాన్, కొండవలస మధ్య సాగే కామెడీ ట్రాక్ ప్రధాన భూమిక పోషించిందంటే అతిశయోక్తి లేదు. వంశీ ఇచ్చిన ఆఫర్ ను నటుడిగానే కాకుండా…