(ఫిబ్రవరి 19న కోన వెంకట్ పుట్టినరోజు)చదువుల తల్లి దయ ఉండాలే కానీ, రచనలు చేయవచ్చు. పదాలతో పదనిసలు పలికించవచ్చు. పదవిన్యాసాలతో మురిపించవచ్చు. పదబంధాలతో మైమరిపించవచ్చు. లక్ష్మీకటాక్షంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగు పెట్టిన కోన వెంకట్, తరువాత సరస్వతీ కరుణతో కలం పట్టి కదం తొక్కారు. ఆ పై పలు వినోదాల తేరుల