పగలే వెన్నెలలు కురిపించిన గానం – అవనినే పులకింపచేసిన గాత్రం – జలతరింగిణికి దీటైన గళం – ఒక్కమాటలో చెప్పాలంటే పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్. జానకి సొంతం. ఆమె పాటలోని మాధుర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఒక్కసారి జానకమ్మ పాటతో సాగితే, మళ్ళీ మళ్ళీ పయనించాలనిపిస్తుంది. ఆమె పాటను మననం చేసుకున్న ప్రతీసారి మధురం మన సొంతమవుతుంది. మనకు పరమానందం పంచిన జానకమ్మ పాటలో ఎంత మాధుర్యం ఉంటుందో, ఆమెలో అదే స్థాయి ఆత్మవిశ్వాసమూ ఉంది. అందువల్లే…