హైదరాబాద్ శివాలలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పక్కాసమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్ తిన్నారు. 37 మంది గంజాయి మత్తులో ఉండడాన్ని గమనించారు. దీంతో 37 మందిని అదుపులో తీసుకున్నారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని చేస్తుండటంతో రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.