Hezbollahs: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.