‘పెళ్ళిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందించిన తాజా వెబ్ సీరిస్ ‘తరగతి గది దాటి’. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో నిర్మితమైన ఈ వెబ్ సీరిస్ టీవీఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’కు రీమేక్. టీనేజ్ రొమాన్స్ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న దీని ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రేమకథ సాగుతుంది. దాంతో తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావరి, దాని…