ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్‌పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్ 2027లో మరలా ఐపీఎల్‌లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది.…