Harold Das: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.