మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో.. ఇప్పుడు ఆమె కెప్టెన్సీకే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ‘టీ20…