ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి మెగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. టోర్నీలోని లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుని.. సెమీస్ చేరింది. సెమీఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లుతో పాటు…