తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని…