‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఎన్నో వాయిదాల తర్వాత జూలై 12వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున, ఇప్పటి నుంచి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు…