అలాగ వచ్చి, ఇలాగ ఎగసిపడిన హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్ ను చూసినా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గుర్తుకు వస్తుంది. తరువాత ఉసూరుమని కూలిన వైనమూ వరుణ్ కెరీర్ లో దాగుంది. అప్పట్లో నవతరం కథానాయకునిగా అలరించిన వరుణ్ సందేశ్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వరుణ్ సందేశ్ 1989 జూలై 21న ఒరిస్సాలోని రాయగడలో జన్మించాడు. నాలుగేళ్ళు ఇండియాలోనే ఉన్న తరువాత వారి కుటుంబం అమెరికాకు…