యంగ్ హీరో శర్వానంద్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ గత కొంతకాలంగా సరైన కథలతో సినిమాలు చెయ్యకుండా ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ‘ఒక ఒక జీవితం’ సినిమాతో శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ నంబర్స్ పరంగా శర్వాకి పెద్దగా కలిసోచ్చిందేమి లేదు. ఇలా అయితే అవ్వదు అనుకున్నాడో లేక ఈసారి వింటేజ్ శర్వానంద్ ని చూపించాలి అనుకున్నాడో తెలియదు కానీ…
(మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు)ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెదుక్కోవాలని సామెత! యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. దాంతో చిత్రసీమలోనే పారేసుకున్న మనసును సంతృప్తి పరచడానికి పరితపించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్. శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బి.కామ్, పూర్తి చేశాడు శర్వానంద్. కాలేజ్ లో…